CM Revanth Reddy: We will waive the loan by August 15
CM Revanth Reddy: రైతుల రుణమాఫీ ఆగస్టు 15లోపు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.2లక్షల రైతు రుణమాఫీపై తమకి ఒక ప్రణాళిక ఉందన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడం, పన్నులు రాబట్టడం, దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి సాక్షిగా రుణమాఫీ చేసి తీరుతామని మళ్లీ మరో దేవతపై ఒట్టు వేశారు.
రుణమాఫీ చేయడానికి రూ.30 నుంచి రూ.40 కోట్లు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు తెలిపారు. ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది. అసలు ఎన్నికల ముందు డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. తర్వాత నెల రోజుల్లో చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆగస్టు అనడంతో ఏ మాట నమ్మాలో ప్రజలకు తెలియడం లేదు. అసలు రుణమాఫీ చేసే ఆలోచన సీఎంకు ఉందా? లేదా? అని ప్రజలు భావిస్తున్నారు.