»Remains Of The Biggest Snake That Ever Roamed The Earth Were Found In Gujarat
biggest snake: గుజరాత్లో బయట పడ్డ అతిపెద్ద పాము అవశేషాలు
ఈ భూమి మీద తిరిగిన అతిపెద్ద పాము మన దేశంలోనిదే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2005లో దొరికిన అవశేషాలను బట్టి దానికి వాసుకి అనే పేరు కూడా పెట్టారు. అది గుజరాత్లో గుర్తించారు.
Remains of the 'biggest snake that ever roamed the earth' were found in Gujarat!
biggest snake: గుజరాత్ రాష్ట్రంలో వెలికితీసిన పాము అవశేషాలను బట్టి అది ఈ భూమి మీద తిరిగిన అతిపెద్ద పాము అదే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని వెన్నుపూస టి-రెక్స్ కంటే పొడవుగా ఉందని తెలిపారు. ఆ పాము అవశేషాలను బట్టి దానికి వాసుకి ఇండికస్ అనే పేరును కూడా పెట్టారు. ఐఐటీ-రూర్కీకి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని 2005లో కనుగొన్నారు. ఇది సరీసృపాల మూలాలు, అలాగే ప్రపంచ పరిణామానికి సంబంధించిన అతి కీలకమైన విషయాలను తెలుపుతుంది. ఈ పాముకు మొత్తం 27 వెన్నుపూసలను పరిశోధకులు గుర్తించారు. అవి అతి పెద్ద కొండచిలువను పోలీ ఉన్నట్లు అలాగే విషపూరితం కూడా కావని కనిపెట్టారు. ఈ పాము సుమారు 11-15 మీటర్లు (సుమారు 50 అడుగులు) పొడవు, 1 టన్ను బరువు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ‘స్ప్రింగర్ నేచర్’పై ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ఈ సమాచారాన్ని గురువారం ప్రచురించారు.
“దాని పెద్ద పరిమాణాన్ని బట్టి చూస్తే వాసుకి నెమ్మదిగా కదిలుతుంది. ఇది కూడా అనకొండ, కొండచిలువల్లా ప్రాణిని చుట్టి చంపేస్తుందని వెల్లడించారు. ఇది చిత్తడి నెలలో ఎక్కువగా నివసించిందని IIT-రూర్కీలో పాలియోంటాలజీలో పోస్ట్‌డాక్టోరల్ పరిశోధకుడు దేబజిత్ దత్తా ది గార్డియన్ పత్రికకు వెల్లడించారు. 60 మిలియన్ సంవత్సరాల క్రితం కొలంబియాలో నివసించిన టైటానోబోవా అనే పాముతో పోల్చారు. అది దాదాపు 43 అడుగుల పొడవు, ఒక టన్ను కంటే ఎక్కువ బరువు కలిగి ఉండేది. టైటానోబోవా వెన్నుపూస వాసుకి కంటే కొంచెం పెద్దది కానీ వాస్తవానికి ఆ రెండింటిలో ఏది పెద్దది అనేది కచ్చితంగా చెప్పలేమని పాలియోంటాలజిస్ట్, రూర్కీలో ప్రొఫెసర్ సునీల్ బాజ్‌పాయ్ తెలిపారు. 10 మీటర్లు (33 అడుగులు) పొడవు ఉన్న రెటిక్యులేటెడ్ కొండచిలువ ఆసియాలోని జీవించి ఉన్న అతిపెద్ద పాము.
IIT Roorkee's Prof. Sunil Bajpai & Debajit Datta discovered Vasuki Indicus, a 47-million-year-old snake species in Kutch, Gujarat. Estimated at 11-15 meters, this extinct snake sheds light on India's prehistoric biodiversity. Published in Scientific Reports. #SnakeDiscoverypic.twitter.com/ruLsfgPQCc