KCR : రాష్ట్రాన్ని కరువు కాటెయ్యడంతో సాగు నీరు లేక ఎండిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఆదివారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ధరావత్తండాలో పంటలు ఎండి తీవ్రంగా నష్టపోయిన పలువురు అన్నదాతలను కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 100రోజుల కాంగ్రెస్ పాలనలో 200మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. సాగునీటికి నీరు లేక రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులు ఆదుకోవాలని కోరారు. పెట్టుబడి పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని వివరించారు. నీళ్లు ఇస్తామన్నారు కాబట్టి నమ్మి పంటలు వేసుకుంటే నట్టేట మునిగిపోయామని రైతులు ఆవేదన చెందుతున్నట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. మొదలే ఇవ్వమని చెప్పి ఉంటే వేసేవాళ్లం కాదని రైతులు తనతో చెప్పారన్నారు. అనవసరంగా ఈ ప్రభుత్వం నష్టం చేకూర్చిందని రైతులు చెప్పారు. గత 7, 8 సంవత్సరాల్లో వ్యవసయ స్థీరకరణ అంశాన్ని కేంద్ర బిందుగా పెట్టుకొని మంచి ఉద్దేశంతోతో బీఆర్ఎస్ స్పష్టంగా పని చేసింది. రైతులకు నీరు సరఫరా, రైతు బంధు పెట్టబడి సాయం, 24గంటలు రెప్పపాటు కరెంటు పోకుండా విద్యుత్ సరఫరా అందించామన్నారు.
110 రోజుల్లనే ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామనుకోలేదన్నారు. మిషన్ భగీరథ ను పట్టించుకునే నాథుడే లేడు. గతంలో ప్రతి రోజు మానిటరింగ్ ఉండేదని, ఇప్పుడు అలాంటిది ఏమి లేదని చెబుతున్నారు. అడిగేవాళ్లు లేరు అని చెబుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రావాలంటే కరెంటు కూడా ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు కేసీఆర్. వచ్చిపోయే కరెంటుతో రైతుల బావి మోటర్లు కాలిపోతున్నాయి. కేసీఆర్ గడప దాటగానే కట్క బంద్ చేసినట్లు ఆగిపోతాయని ప్రశ్నించారు. జూన్ చివరకు పోతే తప్పా నీళ్లు రావు. వర్షాలు బాగా కురిస్తే తప్పా ఊట రావు. ఈ మూడు నెలలు ప్రజల పరిస్థితి ఏంది..? అంటూ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.