Walking Mistakes : ఈ బిజీ బిజీ జీవితాల్లో మంచి పౌష్టికాహారం తినడం ఎంత అవసరమో, రోజూ వ్యాయామం, నడక లాంటివీ అంతే అవసరం. అందుకనే చాలా మంది రోజూ వాకింగ్ చేయడాన్ని నియమంగా పెట్టుకుంటారు. అయితే అలా వాకింగ్ చేసేప్పుడు కొన్ని తప్పులు(Mistakes) మాత్రం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
కొందరు వాకింగ్ చేసేప్పుడు కబుర్లు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ వాకింగ్(Walking) చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అసలు పని మీద కంటే కబుర్ల మీదే ఎక్కువ దృష్టి పెడతారు. అందువల్ల వాకింగ్పై దృష్టి ఉండదు. మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ చేయడం కంటే నడక మీద దృష్టి పెట్టి వీలైనంత వేగంగా నడవడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయి.
వాకింగ్(Walking) చేసేప్పుడు చాలా మంది ఎప్పుడూ ఒకటే వేగాన్ని మెయింటన్ చేస్తుంటారు. అయితే అలా కాకుండా మూడు నిమిషాలు నెమ్మదిగా మరో మూడు నిమిషాలు వేగంగా చేయడం వల్ల బాడీ మెటబాలిజం వేగవంతం అవుతుంది. శరీరం ఎక్కువ క్యాలరీను ఖర్చు చేస్తుంది. ఫలితంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
నడిచేప్పుడు కాళ్లతోపాటుగా చేతులకూ పని చెప్పండి. వాటినీ ఒక రిథమిక్‌గా కదుపుతూ ఉండటం వల్ల భుజాలు, చేతులకూ వ్యాయామం అవుతుంది. గుండెకు రక్త సరఫరా ఎక్కువగా అవుతుంది. పొట్ట తగ్గేందుకు వాకింగ్ చేసే వారు పొట్ట కండరాలను కాస్త లోపలకి లాగి నడవాలి. అప్పుడు అక్కడి నుంచి కొవ్వులు కరుగుతాయి.