రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్క రోజే సంభాషించారు. ఈ సందర్భంగా వారిరువురూ కూడా ఎన్నికల తర్వాత తమ దేశాలకు రావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
PM Modi Russia Ukraine Visit : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ఒక్కరోజే ఫోన్లో మాట్లాడారు. తొలుత రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆయన ఫోన్లో( Phone) సంభాషించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని తన ఎక్స్ ఖాతాలో బుధవారం ట్వీట్ చేశారు. పుతిన్ భారీ ఆధిక్యంతో గెలిచి ఐదో సారి తిరిగి రష్యా అధ్యక్షుడిగా బాధ్యతల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడిన మోదీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే ఉక్రెయిన్‌తో చర్చల ద్వారానే సమస్యల్ని వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పుతిన్ మోదీని రష్యాకు ఆహ్వానించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు.
రష్యా అధ్యక్షుడితో మాట్లాడిన అనంతరం మోదీ(Modi) ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ(Zelenksy) ఫోన్లో(Phone) మాట్లాడారు. రష్యా- ఉక్రెయిన్ సంక్షోభానికి సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అందుకు భారత్ కూడా కృషి చేస్తుందని చెప్పారు. యుద్ధ సమయంలో భారత్ ఉక్రెయిన్‌కు అందిస్తున్న మానవతా సాయాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. జెలెన్స్కీకి కూడా దౌత్య మార్గాల ద్వారానే సమస్యల్ని ఆ రెండు దేశాలూ పరిష్కరించుకోవాలని చెప్పారు. ఉక్రెయిన్‌కు భారత్ అందిస్తున్న సాయంపై జెలెన్స్కీ ప్రశంసలు కురిపించారు. ఎన్నికల అనంతరం తమ దేశాన్ని మోదీ సందర్శించాలని ఆయన కోరారు.
వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 21, 22 తేదీల్లో భూటాన్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఆ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు కేంద్ర విదేశాంత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మళ్లీ ఆయన ఎప్పుడు పర్యటనకు వెళతారనే విషయాన్ని వెల్లడిస్తామని తెలిపింది.