AP: అమరావతి కేవలం ప్రాంతం కాదు.. ఒక భావోద్వేగం అని టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు పేర్కొన్నారు. ‘అమరావతికి రాజధాని లేకుండానే విభజన జరిగింది. అమరావతిని గత ప్రభుత్వం అణచివేసి, మూడు ముక్కలాట ఆడింది. రాజధానికి భూములిచ్చిన రైతులను గత ప్రభుత్వం హింసించింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై 3 వేలకుపైగా కేసులు పెట్టారు. అమరావతి రైతుల కన్నీళ్లకు ఈ బిల్లు పరిష్కారం’ అని తెలిపారు.