»Whatsapp To Soon Block Screenshots Of Profile Photos Heres What It Means For Users
Whatsapp DP Screenshot : వాట్సాప్ డీపీని ఇక ఎవరూ స్క్రీన్‌షాట్ తీయలేరు
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రత విషయంలో ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లను తెస్తూ ఉంటుంది. డీపీని స్క్రీన్ షాట్ చేయడానికి వీలు లేకుండా ఉండే ఫీచర్‌ను తొందరలో తీసుకురానుంది.
Whatsapp New Feature : ప్రస్తుత కాలంలో వాట్సాప్ చూడకుండా రోజు గడవదనే చెప్పవచ్చు. అందుకనే తమ వినియోగదారుల భద్రత విషయంలో సంస్థ ఎప్పుడూ కొత్త అప్డేట్లను తీసుకొస్తూనే ఉంటుంది. ఇటీవల కాలంలో వాట్సాప్ డీపీలను స్క్రీన్ షాట్(Whatsapp DP Screenshot) చేసి దుర్వినియోగం చేసే ఘటనలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్క్రీన్ షాట్ తీయడానికి వీలు లేకుండా కొత్త ఫీచర్‌ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది.
తమ యూజర్ల ప్రైవసీకి సంబంధించిన భద్రతను మరింత పెంచేందుకే తాము ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్ల కోసం మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. టెస్టింగ్ పూర్తయిన తర్వాత వీలైనంత తొందరగా ఈ ఫీచర్‌ని వాట్సాప్(Whatsapp )వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ ఫీచర్ వచ్చిన తర్వాత ఇక ఎవరూ కూడా మన డీపీని స్క్రీన్ షాట్ తీయలేరు. ఒక వేళ ఎవరైనా తీయాలని ప్రయత్నిస్తే ‘కాంట్ టేక్ ఈ స్క్రీన్ షాట్ డ్యూ టు యాప్ రిస్ట్రిక్షన్స్’ అనే సందేశం వస్తుంది. ప్రస్తుతం గూగుల్ పే, పేటీఎం, స్నాప్ ఛాట్ లాంటి యాప్స్‌లో ఈ ఫీచర్‌ని మనం చూస్తుంటాం. గతంలో ప్రొఫైల్ పిక్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా వాట్సాప్‌లో ఉండేది. అయితే దుర్వినియోగం పెరుగుతోందని గుర్తించిన సంస్థ ఈ ఆప్షన్ని 2019లో తీసివేసింది. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌ని సైతం తీసుకురానుంది.