»The Students Were Upset Because They Were Not Allowed To Smoke Cigarettes
Video Viral: యూనివర్సిటీలో సిగరెట్లు తాగొద్దన్నందుకు రెచ్చిపోయిన విద్యార్థులు
విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో క్యాంపస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. దీంతో కొందరు విద్యార్థులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఈ కేసులో మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఈ మధ్యకాలంలో కొందరు విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో(Universities) వికృత చేష్టలకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. చదువుల తల్లి ఒడిలో మద్యపానం, ధూమపానం (Drinking and smoking) వంటివి చేస్తూ తోటి విద్యార్థులకు కూడా నరకం చూపిస్తున్నారు. నిత్యం ఇటువంటి ఘటనలు ఏదోక చోట యూనివర్సిటీలలో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే నోయిడాలోని గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో(Gautam Buddha University) జరిగింది. కొందరు విద్యార్థులు ఆదివారం యూనివర్సిటీలో రచ్చ రచ్చ చేశారు.
సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగిన వీడియో:
సిగరెట్లు(smoking) తాగొద్దన్నందుకు విద్యార్థులంతా కలిసి యూనివర్సిటీ సిబ్బందిపై దాడి చేశారు. రాత్రి సమయంలో యూనివర్సిటీ(University)ని రణరంగంగా మార్చి అలజడిని రేకెత్తించారు. ఆదివారం యూనివర్సిటీ క్యాంపస్‌లోని మున్షీ ప్రేమ్ చంద్ హాస్టల్లో కొందరు విద్యార్థులు ధూమపానం చేయగా అక్కడున్న కొందరు విద్యార్థులు వారిని గమనించి సెక్యూరిటీకి చెప్పారు. ఈ మేరకు సెక్యూరిటీ సిబ్బంది ధూమపానం(smoking) చేస్తున్న వారిని అడ్డుకుని హెచ్చరించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో క్యాంపస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. దీంతో కొందరు విద్యార్థులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఈ కేసులో మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.