»Man Beats Old Woman With Her Own Stick 50 Times In Two Minutes
Viral: రెండు నిమిషాల్లో 50బెత్తం దెబ్బలు.. వృద్ధురాలిని స్పృహ కోల్పోయే వరకు కొట్టిన వ్యక్తి
చాలా ఆందోళన కలిగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వృద్ధురాలు బాధతో విలపిస్తూ కనికరం కోసం వేడుకున్నప్పటికీ ఆ వ్యక్తి హృదయం మాత్రం చలించడం లేదని వైరల్ క్లిప్‌లో చూడవచ్చు.
Viral: ఓ వ్యక్తి 60 ఏళ్ల వృద్ధురాలిని కొట్టిన ఓ బాధాకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధురాలిని 2 నిమిషాల వ్యవధిలోనే 50 సార్లు కర్రతో కొట్టాడు. ఈ ఘటన అమెరికాలోని హార్లెమ్ సబ్వే స్టేషన్‌కి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగింది. ఆ సమయంలో మహిళ వెస్ట్ 116వ వీధి వైపు వెళుతోంది. ఈ విషయమై అధికారులు సమాచారం అందించారు.
సుమారు రెండు నిమిషాల ఈ వీడియో ట్విటర్లో షేర్ చేయబడింది. వీడియో ప్రారంభంలో దాడి చేసిన వ్యక్తి తన గొడుగుతో మహిళను కొట్టడం చూడవచ్చు. అప్పుడు ఆ స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి తన కర్రతో అతన్ని ఆపింది. అయితే ఆ వ్యక్తి ఈ కర్రను లాక్కొని మహిళపై దాడి చేయడం ప్రారంభించాడు. వృద్ధురాలు అపస్మారక స్థితికి వచ్చే వరకు ఆమెను కొట్టాడు. అతను ఆ మహిళ తల, కడుపు, కాళ్ళు, చేతులు, నడుము దాదాపు అన్ని ఇతర భాగాలపై కొట్టాడు.
చాలా ఆందోళన కలిగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వృద్ధురాలు బాధతో విలపిస్తూ కనికరం కోసం వేడుకున్నప్పటికీ ఆ వ్యక్తి హృదయం మాత్రం చలించడం లేదని వైరల్ క్లిప్‌లో చూడవచ్చు. మహిళ అపస్మారక స్థితికి చేరుకునే వరకు ఆమెపై బెత్తంతో దెబ్బల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన మహిళపై ఈ దారుణం జరిగింది. ఈ సమయంలో ఆ వ్యక్తిని ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. పోలీసులు వచ్చేలోపే గుర్తు తెలియని నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను వారు గుర్తించారు. దుండగుడు, వృద్ధురాలి మధ్య గొడవ ఎలా మొదలైందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.