»Kerala Gets Its First Transgender Lawyer In Padma Lakshmi
Kerala First Transgender Lawyer: మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మాలక్ష్మి..పలువురి ప్రశంసలు
కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్(Transgender) న్యాయవాది(Lawyer)గా పద్మాలక్ష్మీ(PadmaLakshmi) రికార్డు నెలకొల్పారు. కేరళ రాష్ట్ర బార్ కౌన్సిల్ లో లాయర్(Lawyer)గా ఆమె తన పేరును నమోదు చేసుకుని చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా కేరళ మంత్రి పీ రాజీవ్ స్పందిస్తూ..దేశంలోని అనేక మంది ట్రాన్స్ జెండర్ల(Transgender)కు పద్మాలక్ష్మీ ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో పద్మాలక్ష్మి(PadmaLakshmi)ని అభినందిస్తూ ఆయన పోస్టు చేశారు.
కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్(Transgender) న్యాయవాది(Lawyer)గా పద్మాలక్ష్మీ(PadmaLakshmi) రికార్డు నెలకొల్పారు. కేరళ రాష్ట్ర బార్ కౌన్సిల్ లో లాయర్(Lawyer)గా ఆమె తన పేరును నమోదు చేసుకుని చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా కేరళ మంత్రి పీ రాజీవ్ స్పందిస్తూ..దేశంలోని అనేక మంది ట్రాన్స్ జెండర్ల(Transgender)కు పద్మాలక్ష్మీ ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో పద్మాలక్ష్మి(PadmaLakshmi)ని అభినందిస్తూ ఆయన పోస్టు చేశారు. బార్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ కోసం బార్ కౌన్సిల్ కార్యక్రమంలో 1500 మంది పాల్గొన్నారని, అందులో పద్మా లక్ష్మీ కూడా ఉన్నారన్నారు.
పద్మా లక్ష్మీ(PadmaLakshmi) ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో డిగ్రీ పట్టాను పుచ్చుకున్నారన్నారు. లాయర్(Lawyer) కావడానికి పద్మాలక్ష్మీ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు. జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కొని కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్(Transgender) న్యాయవాదిగా ఆమె పేరును నమోదు చేసుకోవడం అభినందనీయమన్నారు.
ఇండియాలో మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ జడ్జిగా పేరు నమోదు చేసుకున్న జోయితా మోండల్ లాగే పద్మాలక్ష్మీ(PadmaLakshmi) కూడా ఉన్నత స్థితికి చేరారన్నారు. జోయితా మోండల్ కూడా 2017లో పశ్చిమ బెంగాల్ ఇస్లాంపూర్ లోక్ అదాలత్ లో న్యాయమూర్తిగా నియమితులై చరిత్ర లిఖించారు. 2018లో ట్రాన్స్ జెండర్(Transgender) విద్యా కాంబ్లే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో లోక్ అదాలత్ లో జడ్జిగా నియమితులవ్వగా ఆ తర్వాత దేశంలో మూడో ట్రాన్స్ జెండర్ న్యాయమూర్తిగా స్వాతి బిధాన్ బారుహ్ నియమితులయ్యారు.