జ్యూయెలరీ షాపులలో దొంగలు పడటం సహజమే కానీ.. ఆ దొంగలు మనుషులు కాకుండా వేరే అయితే అప్పుడు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా ఓ గోల్డ్ షాపులో ఎలుక దొంగతనం చేసింది. అది కూడా ఏదో చిన్న దొంగతనం కాదండోయ్. పెద్దదే. వస్తువు చిన్నదే అయినా అది ఎత్తుకెళ్లింది చాలా కాస్ట్లీ ఐటెమ్. అదే డైమండ్ నెక్లస్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే.. ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఎప్పుడు జరిగింది అనే వివరాలు తెలియలేదు. దానికి సంబంధించిన వీడియో మాత్రం బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ ఎలుకను భర్తలతో పోల్చుతున్నారు. భర్తయితేనేం… ఎలుక అయితేనేం.. అందరిదీ అదే పరిస్థితి.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.