China : పొరుగింటి వ్యక్తిపై కక్ష పెంచుకున్న వ్యక్తి తనపై విచిత్రంగా పగ తీర్చుకున్నాడు. అతని చెట్ల(tree)ను నరికినందుకు.. తన కోళ్ల(Hen)ను ప్లాష్ లైట్ కొట్టి వాటిని భయబ్రాంతులకు గురిచేసి వాటి మరణానికి కారణమయ్యాడు. ఈ కేసులో అతడికి కోర్టు ఆరు నెలలు జైలుశిక్ష విధించింది. చైనాలో జరిగిన ఈ వింత ఘటన వివరాల్లోకి వెళితే.. చైనా(China)లో నివసిస్తున్న మిస్టర్ గు, జాంగ్ కు మొదట్లో మంచి సాన్నిహిత్యమే ఉండేది. కానీ ఏడాది క్రితం గూ అనుమతి లేకుండా జాంగ్ అతని చెట్లను నరికివేశాడు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగాయి. జాంగ్ పై గూ పగపెంచుకున్నాడు. ఈ గొడవలు 2022 ఏప్రిల్ నుంచి మరింతగా పెరిగాయి. దీనికి కారణం తన చెట్లను నరికివేస్తున్నాడని గూ ఆరోపించాడు. జాంగ్ కోళ్ల ఫారమ్(FOULTRY)లోకి చొరబడి..కోళ్ల ముఖాలపైకి ఫ్లాష్‌లైట్(Flash light) కొట్టాడు. దీంతో కోళ్లన్నీ భయంతో ఒక మూలకు చేరి చనిపోయాయి.
అలా ఓకేరోజు జాంగ్ కోళ్లఫారంలో 460 కోళ్లు చనిపోయాయి. ఇది గూ పనేనని గ్రహించి జాంగ్ అతని పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసు(police)లు గూను అరెస్ట్ చేశారు.నష్టపరిహారంగా గూకు 3000 యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.35,700 చెల్లించాల్సిందిగా రాజీ కుదిర్చారు. దీంతో జాంగ్‌పై మిస్టర్ గుకు ఇంకా కోపం పెరిగిపోయింది. మరోసారి కోళ్ల ఫారమ్‌లోకి చొరబడి మరొమరోసారి ఫ్లాష్ లైట్ వేయటంతో 640 కోళ్లు చనిపోయాయి. మళ్లీ జాంగ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి సెంట్రల్ చైనాలోని హునాన్ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం(Court) ఉద్దేశపూర్వకంగానే ఇతరులకు ఆస్తి నష్టం కలిగించాడని గుర్తించి జాంగ్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. చనిపోయిన 1100 కోళ్ల విలువ దాదాపు 13,840 యువాన్లు (రూ.1,64,855) ఉంటుందని అధికారులు అంచనావేశారు.