Using Earphones: ఇయర్ ఫోన్స్ వాడేవారికి అలర్ట్..ప్రమాదం పొంచి ఉన్నట్లే
ఇప్పుడున్నది టెక్నాలజీ యుగం. సాంకేతిక పరికరాల వాడకం ఎక్కువవుతోంది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్స్(Smart Phones), ఇయర్ ఫోన్స్(Earphones) లేకుండా ఉండలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా యువత చెవిలో ఇయర్ ఫోన్స్ దర్శనమిస్తోంది. కానీ ఇక్కడే ఓ ప్రమాదం పొంచి ఉంది. ఈ ఇయర్ ఫోన్స్ (Earphones)ను అతిగా వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు(Health Problems) తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 4 నిమిషాల కంటే ఎక్కువగా ఇయర్ ఫోన్స్(Earphones) వాడితే ప్రమాదమంటున్నారు.

ఇయర్ ఫోన్స్(Earphones)ను ఎక్కువగా వాడితే చెవుడు(Deaf) వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇయర్ ఫోన్స్(Earphones) పెట్టుకుని సంగీతం వినేవారికి వినికిడి లోపం కనిపిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆపకుండా అదే పనిగా ఇయర్ ఫోన్స్(Earphones) పెట్టుకుని వింటే లాభాల కంటే నష్టాలే ఎక్కువ అని, పెద్ద శబ్దాలను చెవిలోని కణాలు తట్టుకోలేవని వైద్యులు సూచిస్తున్నారు.
చెవుడు(Deaf) సమస్యలు రాకుండా ఉండాలంటే ఇయర్ ఫోన్స్(Earphones)ను ఎంత తక్కువగా వాడితే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇండియాలో వయసు పెరగడం వల్ల సమస్యలు వచ్చి బాధపడేవారికంటే కూడా వినికిడి సమస్య(Deaf)తో బాధపడేవారే ఎక్కువగా ఉన్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) వైద్యులు వెల్లడిస్తున్నారు. నిరంతరం ఇయర్ ఫోన్స్(Earphones) పెట్టుకుని వినేవారు చెవులకు విశ్రాంతి కచ్చితంగా ఇవ్వాలన్నారు. ప్రతి 60 నిమిషాలకు ఒక 10 నిమిషాల పాటు చెవులకు విరామం ఇవ్వాలని తెలిపారు.
ఇయర్ ఫోన్స్(Earphones)లో కూడా ఇతరుల ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఇయర్ ఫోన్స్(Earphones) వాడేవారిలో బ్యాక్టీరియా అనేది 7 రెట్లు ఎక్కువగా పెరుగుతుందని, వేరే వారి ఇయర్ ఫోన్స్(Earphones) వాడితే అది ఇంకా ప్రమాదమని పరిశోధకులు తెలిపారు. ఇయర్ ఫోన్స్ తక్కువగా వాడితే ప్రమాదం బారి నుంచి తప్పించుకోవచ్చని, వినికిడి సమస్యలు(Deaf) ఉండవని వైద్యులు సూచిస్తున్నారు.