»Viral Video Dangerous Journey Of School Students 24 People In The Car
Viral Video: ప్రమాదకరంగా స్కూల్ స్టూడెంట్స్ ప్రయాణం..కారులో 24 మంది!
ఓ కారులో 24 మంది స్టూడెంట్స్ ను పశువుల్లా తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ప్రాణాలకే ముప్పు కలిగించే ఈ ప్రయాణం నేరం అంటూ తల్లిదండ్రులు కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్(Videos Viral) అవుతుంటాయి. తాజాగా ఓ కారులో 24 మంది ప్రయాణిస్తున్న వీడియో సందడి చేస్తోంది. అందులో అందరూ స్కూల్ విద్యార్థులే కావడం గమనార్హం. ఈ ఘటన గుజరాత్ లోని దాహోద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సుమారు 24 మంది పాఠశాల విద్యార్థులను పశువులను వాహనాల్లో తరలిస్తున్నట్లుగా తరలిస్తుండటం వీడియోలో చూడొచ్చు. ఈ ప్రమాదకర ప్రయాణం అందరిలో ఆందోళనను కలిగిస్తోంది.
24 మంది స్కూల్ స్టూడెంట్స్(School students) ఓ కారులో ప్రయాణిస్తున్నారు. అందులో కొందరు కారు వెనుక వేలాడుతూ ఉన్నారు. ఇంకొంతమంది పైకప్పుపై కూర్చోని ఉన్నారు. మరికొంత మంది పిల్లలు వాహనం బానెట్ పై కూర్చున్నారు. డ్రైవర్(Driver) అలా పిల్లలందరినీ కూర్చోబెట్టి ప్రయాణం సాగిస్తున్నాడు. గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు అమిత్ చావ్డా(Amith Chavda) ట్విట్టర్లో ఆ వీడియోను షేర్(Video share) చేశారు.
రాజకీయ కార్యక్రమాలకు బస్సులు ఏర్పాటు చేస్తారని, పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి మాత్రం బస్సులు లేవని ఆయన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో భారీ స్పందన లభిస్తోంది. కేవలం 13 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులను డ్రైవర్ అలా కూర్చోబెట్టి కారు నడపడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.