SRD: హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం సరికాదని తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ అన్నారు. సదాశివపేట పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి కండువాలను కప్పి శనివారం ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆస్తుల ధ్వంసం ఆపకుంటే అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.