ఖమ్మం: VDO’S కాలనీలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో బుధవారం స్వచ్ఛ దీపావళిపై ప్రజలకు మున్సిపాలిటీ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణానికి హాని కలిగించే టపాసులను కాల్చవద్దని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే టపాసులు కాల్చిన తర్వాత వచ్చే వ్యర్థాలను సంచిలో వేసి పారిశుద్ధ్య వాహనాలు వేయాలని సూచించారు.