KMM: కాంగ్రెస్ పార్టీని, తనను నమ్ముకుని రాజకీయాల్లో చురుగ్గా పనిచేసిన కార్యకర్త చింతల సుజాత కుటుంబానికి మంత్రి భరోసా ఇచ్చారు. లక్ష రూపాయలను ఆర్థికసాయంగా అందించారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సుజాత కుటుంబాన్ని ఎంపీ రఘురాం రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం పరామర్శించారు.