RR: షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా ఉన్నత స్థాయి పాఠశాలలో పనిచేస్తూ డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులను తిరిగి పాఠశాలకు రప్పించాలని, వారి డిప్యూటేషన్లు వెంటనే క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.