SDPT: శ్రీరామ నామాలు లిఖించి, స్మరిస్తే సకల సిద్ది, శుభాలు కలుగుతాయని గజ్వేల్ కు చెందిన శ్రీరామ కోటి వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్ పట్టణంలోని అద్దాల మండపంలో, భక్తులు రాసిన 11 కోట్ల రామనామ లిఖిత పుస్తకాలను శ్రీరాముడికి సమర్పిస్తూ ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు.