KRD: శాంతి భద్రతల పరిరక్షణ సక్రమంగా ఉంటే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్థూపానికి ఎస్పీ, కలెక్టర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.