WGL: సికింద్రా బాద్ శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని ఉద్దేశ్య పూర్వకంగానే ధ్వంసం చేశారని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు విమర్శించారు. దీనికి నిరసనగా నిన్న శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న హిందువులపై పోలీసులు అక్రమంగా లాఠీ ఛార్జి చేశారన్నారు. దీనికి నిరసనగా నేడు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.