KMM: కరోనా సమయంలో మూజువాణి ఓట్లతో పార్లమెంట్లో లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని CITU జిల్లా కార్యదర్శి రమేష్ అన్నారు. సోమవారం బూర్గంపాడు ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. కార్మిక హక్కులను కాలరాసే ఆ 4 లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ITC BPL గేట్ ముందు ధర్నా చేసి, లేబర్ కోడ్ల ప్రతులను దగ్ధం చేశారు.