HYD: ముసారాంబాగ్ డివిజన్ పరిధిలోని మూసీ బాధితులను కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పరామర్శించి వారితో మాట్లాడారు. మూసీ నిర్వాసితుల వైపు బీజేపీ ఉంటుందని, తప్పకుండా వారి తరఫున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. పేదల ఇళ్లు కూల్చి పెద్దలకు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు.