JGL: ధర్మపురి మండలం జైనకు చెందిన గాజుల రమేశ్ ఇటీవల మృతి చెందాడు. మృతుడికి ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాద బీమా సౌకర్యం ఉంది. ఈ నేపథ్యంలో మృతుడి తండ్రి లచ్చయ్యకి రూ. లక్ష చెక్కును ధర్మపురి సీఐ రాం నరసింహరెడ్డి, బ్రాంచి మేనేజర్ మోహన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.