ADB: ఉట్నూరు మండలంలోని నాగాపూర్ ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్‌ను ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్ ప్రారంభించారు. బీజేపీ నాయకులు కందుకూరి రమేష్ ఆధ్వర్యంలో కందుకూరి అంజన్న-రాజన్నల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. బస్ షెల్టర్ ప్రయాణికులకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రితేష్ రాథోడ్, కందుకూరి రమేష్ ఉన్నారు.