ASF: ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పోటీపడాలని MLA పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని పద్మశాలి భవన్లో నిర్వహించిన PRTU – TS జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని, 317 జీఓ రద్దు విషయంలో ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని తెలియజేశారు.