NLG: పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు.