NGKL: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెంట్లవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నెలలకు సంబంధించి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.