NZB: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో బుధవారం మాంసం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు నోటీసులు జారీ చేశారు. నేడు పట్టణంలో ఎవరూ కూడా మాంసం విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాంసం విక్రయ దారులు, హోటల్స్ యజమానులు, పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.