ఖమ్మం: ‘టీజీఎప్ సెట్-2024’ బీఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కళాశాలలు నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపడతాయని ఖమ్మం ఎస్ఆర్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మహమ్మద్ జాకీరుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్లో భాగంగా 23 వరకు పరిశీలన కొనసాగుతుందన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు.