NLG: హాలియా పట్టణంలోని వీధి వ్యాపారస్తులు ఫుట్ పాత్పై వ్యాపారం చేసుకుంటూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో ఆదివారం పలువురికి జరిమానాలు విధించారు. పురపాలక సంఘం, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వీధి వ్యాపారస్తులకు జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.