MNCL: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు విజయవంతం చేయాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య కోరారు. శుక్రవారం ఆయన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ నవంబర్ 7న పాఠశాల, 21న మండల, 28న జిల్లా స్థాయిలో జరిగే చెకుముకి సంబరాల్లో పాల్గొనేందుకు 8, 9, 10వ తరగతుల విద్యార్థులు అర్హులని తెలిపారు.