NLG: జిల్లా కేంద్రంలోని భాస్కర్ టాకీస్ చౌరస్తా వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వర్షం నీటిలో గుంతలు తెలియక రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి శనివారం మరమ్మత్తులు చేపట్టారు. ఈ మేరకు కంకర సిమెంట్‌తో గుంతలను పూడ్చారు. దీంతో ట్రాఫిక్ పోలీసులను పలువురు అభినందించారు.