MNCL: ప్రపంచ గుండె సంబంధిత వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎంహెచ్వో డాక్టర్ హరీష్ రాజ్ నేతృత్వంలో మున్సిపల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.