నిజామాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంధువుల ఇళ్లపై దౌర్జన్యంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కారణం, వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నేత బంధువుల ఇంటిపై పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజలే KTRను రక్షించుకుంటారని ఆయన తెలిపారు.