భద్రాద్రి: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఇల్లందు CHPలో రైల్వే సైడింగ్ కార్మికులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లు, 3 నేర చట్టాల సవరణలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.