SDPT: బీఆర్ఎస్ పార్టీ దాచారం గ్రామ అధ్యక్షుడు బండి పర్వతాలు యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఆయన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.