SRD: కంది మండల పరిధిలోని గణేష్ గడ్డ సమీపంలో పార్టీ ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా అనుసరించాలో నాయకులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోకి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, ప్రవీణ్ పాల్గొన్నారు.