SRCL: వీరనారి చాకలి ఐలమ్మ 129 వ జయంతి ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో చేపట్టగా, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.