NLR: మర్రిపాడు మండలంలోని పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు బుధవారం ఆత్మకూరు సీఐ గంగాధరరావు, ఎస్సై కే.శ్రీనివాసరావు తెలిపారు. వారు వివరాలను వెల్లడించారు. దొంగల వద్ద నుంచి రూ. 8 వేలు చోరీ సొత్తు, చోరీకి ఉపయోగించిన ఫ్యాషన్ ప్రోమోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పలు స్టేషన్లలో వారిపై కేసులు నమోదైనట్లు తెలిపారు.