SRD: సంగారెడ్డి పట్టణంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యులు ఈనెల 30వ తేదీన పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారని పేర్కొన్నారు.