ASF: సిర్పూర్ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్ధం కాగజ్నగర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సెప్టెంబర్ 23 నుండి ప్రతి సోమవారం ప్రజావాణి కాయక్రమం నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్ల తెలిపారు. తద్వారా ప్రజలకు వ్యయప్రయాసలు తగ్గించడంతో పాటు సత్వర సమస్యల పరిష్కారానికి వీలు ఉంటుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు.