కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛార్జ్ ఎంపీడీవో సూర్యకాంత్ మాట్లాడారు. ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించామన్నారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.