BHPL: అధిక మోతాదుతో ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ఇసుక లారీలను పట్టుకున్నట్లు మహాదేవపూర్ ఎస్సై పవన్ కుమార్ మంగళవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో లారీల వేబిల్లులు చెక్ చేసినట్లు చెప్పారు. అనుమానం వచ్చి బరువు తూగించగా అధిక బరువు ఉన్నట్లు తేలడంతో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.