NGKL: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అచ్చంపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు శుక్రవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ జిల్లా నాయకుడు రాములు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని అన్నారు.