»Ysrtp Leaders Join In Brs Ysr Telangana Party Leaders Have Joined Brs
YSRTP: బీఆర్ఎస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం.. స్వాగతించిన హరీష్ రావు
వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీ బీఆర్ఎస్లో విలీనం అయినట్లుగా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు గట్టు రాంచందర్ రావు అధ్వర్యంలో అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
YSRTP: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏ నాయకులు ఏపార్టీలో ఉంటారో అర్థం కావడమే లేదు. నాయకులే కాదు పార్టీలు సైతం ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాయో.. లేదా ఏ పార్టీలో విలీనం అవుతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీ బీఆర్ఎస్లో విలీనం అయినట్లుగా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు గట్టు రాంచందర్ రావు అధ్వర్యంలో అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ఆర్టీపీని బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు స్వాగతం తెలిపారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు.. తెలంగాణ వాళ్లు పార్టీ పెట్టగలుగుతారా.. పార్టీ నడపగలుగుతారా.. తెలంగాణ వాళ్లకు అంత సీన్ ఉందా అని అవహేళనలు ఎన్నో విన్నామని.. ఇలాంటి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 14 సంవత్సరాలు పార్టీని నిలబెట్టి, రాష్ట్ర సాధన కోసం చావు అంచుల వరకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని హరీశ్ రావు గుర్తు చేశారు.
సమైక్య నాయకులు పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టడం కాదని అవహేళన చేశారన్నారు. అటు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ చీకటి మయమైతుందని చెప్పారు. ఆయనలాంటి వాళ్లకు బుద్ధి చెప్పే లాగా ఈ రోజు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా కేసీఆర్ నిలిపారన్నరు. తండ్రి సమానులైన కేసీఆర్ ని రాజకీయం కోసం నానా మాటలు తిట్టి ఈ రోజు రాజకీయాల కోసం పార్టీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిల అంటూ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తామని చెప్తున్న కర్ణాటక మోడల్ ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు. కర్ణాటకలో రైతులు రోడ్డు మీదకు వచ్చారు. మూడు గంటల కరెంటు ఇచ్చి రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ అని హరీష్ రావు మండిపడ్డారు.