New Secretariat : ఆ ప్రాంతంలో తెల్లవారుజామున 4 నుంచే ట్రాఫిక్ ఆంక్షలు
ఈనెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat) భవనంలో భద్రతా(Securty) ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani kumar), సీనియర్ పోలీస్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) సచివాలయాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) ఎల్లుండి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.. దీంతో సచివాలయం (Secretariat) వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar)సూచించారు.వీవీ విగ్రహం – నెక్లెస్ రోటరీ – ఎన్టీఆర్ మార్గ్ మధ్య వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్‌ను మూసివేయనున్నారు. ఖైరతాబాద్(Khairatabad), పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద షాదాన్, నిరంకారి భవనం వైపు మళ్లిస్తారు.-నిరంకారి, చింతల్ బస్తీ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను అనుమతి లేదు.
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌ను మూసివేయనున్నారు.-ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్ బండ్, రాణిగంజ్ వైపు వెళ్లే వాహనదారులు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ (Tank bund) చేరుకోవాల్సి ఉంటుంది.-ట్యాంక్ బండ్, తెలుగు తల్లి జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎన్టీఆర్ మార్గ్ (NTR Marg) వైపు అనుమతించరు. ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.-బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ఇక్బాల్ మినార్ వైపు మళ్లించనున్నారు.-బడా గణేశ్ లేన్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరి నుంచి వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడా గణేశ్ లేన్ నుంచి రాజ్‌ధూత్ లేన్ వైపునకు మళ్లించనున్నారు.-ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్(Necklace Road), లుంబనీ పార్కు మూసివేయనున్నారు. ప్రయాణికులు సహకరించాలని డీజీపీ తెలిపారు. . ఈ నేపథ్యంలో ఈ రూట్లలో ప్రయాణించే వాహన దారులు ప్రత్యమ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.