»These Are The Election Candidates With Criminal History In Telangana Data Release
Telangana Elections: తెలంగాణలో నేర చరిత్ర కలిగిన ఎన్నికల అభ్యర్థులు వీరే..డేటా విడుదల
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 62 శాతం మందిపై నేర చరిత్ర ఉందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డేటా విడుదల చేసింది. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏయే పార్టీల్లో ఎంత మందికి నేర చరిత్ర ఉందో, అత్యధిక కేసులు కలిగిన అభ్యర్థులెవరో తెలుపుతూ ఓ డేటాను విడుదల చేసింది.
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) జరుగుతున్న వేళ ఓ షాకింగ్ డేటాను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (Forum For Good Governance) విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో 62 శాతం మంది వివిధ నేరాల కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు వెల్లడించింది. నవంబర్ 30వ తేదిన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం అభ్యర్థులు తమ నామినేషన్లతో పాటుగా అఫిడవిట్లను సమర్పించారు. వాటి ద్వారా నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల వివరాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణ ఎన్నికలలో 119 స్థానాలకు గాను 360 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 226 మందికి నేర చరిత్ర ఉంది. pic.twitter.com/slCLaj5L7g
తెలంగాణ ఎన్నికల్లో 119 స్థానాలకు 360 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో 226 మంది అభ్యర్థులపై నేర చరిత్ర ఉంది. ఈ విషయాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. ఓటర్లను చైతన్యపరిచేందుకు ఈ డేటాను విడుదల చేసినట్లు తెలిపింది. రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా తమ అభ్యర్థులలో నేర చరిత్ర కలిగిన వారికి టికెట్లు కేటాయించినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలయజేసింది.
226 CANDIDATES WITH CRIMINAL CASES CONTESTING TELANGANA ASSEMBLY POLLS : About 360 candidates of BRS, INC, BJP, MIM etc contesting the Telangana Assembly polls, 226 of them criminal cases against them, according to Forum for Good Governance.@NewIndianXpress@XpressHyderabadpic.twitter.com/mhNbsbItzW
ఎన్నికల్లో నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం అంత మంచి విషయం కాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు తెలిపారు. సుప్రీం కోర్టు నిబంధనలను పక్కనపెట్టి వివిధ రాజకీయ పార్టీలు నేర చరిత్ర కలిగిన వారికి టికెట్లు ఇవ్వడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఫోరం సభ్యులు పేర్కొన్నారు. అన్ని ప్రధాన పార్టీల్లోనూ క్రిమినల్ కేసులు ఉండటం వల్ల అందరూ మౌనంగా ఉంటూ ప్రచారం సాగిస్తున్నట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నేర చరిత్ర కలిగిన వారిలో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో గంగుల కమలాకర్‌పై అత్యధికంగా 10 కేసులు, కేటీఆర్‌పై 8, సబితా ఇంద్రారెడ్డిపై 5, సైదిరెడ్డిపై 5 కేసులు ఉన్నట్లు డేటా చెబుతోంది. కాంగ్రెస్ పార్టీలో చూస్తే అత్యధికంగా రేవంత్ రెడ్డిపై 89 కేసులు, ఖానాపూర్ అభ్యర్థి వెడ్మ బోజ్జుపై 52 కేసులు, జగ్గారెడ్డిపై 20 కేసులు ఉన్నాయి. అలాగే బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై 89 కేసులు, బండి సంజయ్‌పై 59, సోయం బాపురావుపై 55, రఘునందన్ రావుపై 20 కేసులు ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. ఈ నేరచరిత్ర కేసులను బట్టీ ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని ఫోరం సభ్యులు సూచించారు.