»Telangana Woman As Deputy Mayor Of Australia Sandhya Reddy
Telangana woman: ఆస్ట్రేలియా డిప్యూటీ మేయర్‌గా తెలంగాణ మహిళ
ఇటివల కాలంలో ఏ పొరుగు దేశం వెళ్లినా కూడా తెలుగు ప్రజలు కచ్చితంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైదరాబాద్ కు చెందిన మహిళ సంధ్యారెడ్డి(sandhya reddy) ఏకంగా ఆస్ట్రేలియా(Australia)లో డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకుంది. దీంతో స్థానికులతోపాటు తెలుగు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని హైదరాబాద్ కు చెెందిన మహిళ సంధ్యారెడ్డి(sandhya reddy) అరుదైన ఘనతను సాధించారు. ఆస్ట్రేలియా(Australia)లోని స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు సంధ్యారెడ్డిని ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల కూడా అభినందించారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు. సెప్టెంబర్ 5న జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఎన్నికయ్యారు.
స్ట్రాత్‌ఫీల్డ్ ప్రజలకు సేవ చేయడానికి మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తానని సంధ్యారెడ్డి చెప్పారు. స్థానికుల(local people) జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఇతర కౌన్సిలర్లతో కలిసి పని చేస్తానని ఆమె తన విజయ ప్రసంగంలో వెల్లడించారు. డిప్యూటీ మేయర్‌గా సంధ్యా రెడ్డి ఎన్నిక కావడం ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజానికి చెప్పుకోదగ్గ విజయమని చెప్పవచ్చు. ప్రజాసేవ పట్ల ఆమె చేసిన కృషికి, అంకితభావానికి ఇది నిదర్శనమని పలువురు అంటున్నారు. సంధ్యా రెడ్డి స్ట్రాత్‌ఫీల్డ్‌లో సుప్రసిద్ధ సంఘం నాయకురాలుగా ఉన్నారు. స్ట్రాత్‌ఫీల్డ్ కమ్యూనిటీ సెంటర్, నైబర్‌హుడ్ వాచ్‌తో సహా అక్కడి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఆమె అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆమెకు 2020లో స్ట్రాత్‌ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది.