»Priyanka Gandhi Said Brs Government Is Stuck In Land Sand And Wine Mafias In Telangana
Priyanka gandhi: ల్యాండ్, శాండ్, వైన్ మాఫీయాల్లో BRS ప్రభుత్వం కూరుకుపోయింది
తెలంగాణలో బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా అధికారంలో ఉండి ధనవంతులు కావడమే వారి లక్ష్యమని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(priyanka gandhi) అన్నారు. భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆమె బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ(telangana)లో ల్యాండ్, శాండ్, వైన్ మాఫీయాల్లో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కూరుకుపోయిందని ప్రియాంక గాంధీ(priyanka gandhi) ఆరోపించారు. దేశంలోనే ‘ఫామ్‌హౌస్’ నుంచి పరిపాలన చేసిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని కాంగ్రెస్ నేత అన్నారు. భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్న క్రమంలో పేర్కొన్నారు. కేంద్రంలో అవసరమైనప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అధికారంలో ఉండగా పేదలు మరింత పేదలుగా మారుతున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు.
ఈ క్రమంలో దొరల తెలంగాణ బలపడుతుందని..ప్రజలు మాత్రం బలహీన పడుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో దోచుకున్న సొమ్ముతో తెలంగాణలో సంపన్న పార్టీగా బీఆర్ఎస్ ఉండగా.. ప్రపంచంలో బీజేపీ ఉందన్నారు. కేసీఆర్ విధానాలన్నీ పెద్ద వ్యాపారుల కోసం మాత్రమే ఉన్నాయని ప్రియాంక గాంధీ ఆరోపించారు. చిన్న వ్యాపారుల కోసం కేసీఆర్ చేసిందేమి లేదన్నారు. మరోవైపు ధరణి ద్వారా లక్షల మంది రైతులు వారి భుములను కోల్పోయినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉపాధి విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగార్థులకు అన్యాయం చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం రావాలని, మీ ఓటను వ్యర్థం చేసుకోవద్దని ప్రియాంక ఓటర్లను కోరారు. మీరు వేసే ఓటే నేతల ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో సరికొత్త వికాసం రానుందని చెప్పారు. మీ ఆశలను నేరవేర్చేందుకే మా అమ్మ సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినట్లు చెప్పారు. కానీ ప్రస్తుతం సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రంలో దారుణంగా ఉందని ఆరోపించారు.